Saturday, February 5, 2011

వీణ నాది తీగె నీది, కుశలమా నీకు

వీణ నాది తీగె నీది


 




వీణ  నాది  తీగె  నీది  తీగ  చాటు  రాగముంది  
తీగ చాటు రాగముంది 
పువ్వు నాది,పూత నీది,ఆకు చాటు అందముంది                      "వీణ"

తొలిపొద్దు ముద్దాడగానే ఎరుపెక్కే తూరుపు దిక్కు  
తొలి చూపు మాటాడగానే  వలపొక్కటే వయసు దిక్కు 
వరదల్లె వాటేసి,మనసల్లే మాటేసి,వయసల్లే కాటేస్తే చిక్కు 
తీపి ముద్దిచ్చి తీర్చాలి మొక్కు                                                "వీణ"

మబ్బుల్లో మెరుపల్లే కాదు వలపు వాన కురిసి వెలిసిపోదు 
మనసంటే మాటలు కాదు అది మాట ఇస్తే మరచిపోదు 
బ్రతుకల్లే జతగూడి,వలపల్లే ఒనగూడి, ఒడిలోనే గుడికట్టే దిక్కు,
నా గుడి దీపమై నాకు దక్కు                                                     "వీణ" 

చిత్రం                              కటకటాలరుద్రయ్య
రచన                              వేటూరి 
సంగీతం                          జే.వి.రాఘవులు


కుశలమా నీకు 

 


కుశలమా నీకు కుశలమేనా 
మనసు నిలుపుకోలేకా మరీ మరీ అడిగాను అంతే అంతే అంతే 
కుశలమా మీకు కుశలమేనా 
ఇన్నినాళ్ళు వదలలేకా ఏదో ఏదో వ్రాసాను 
అంతే అంతే అంతే  
కుశలమా                                         

చిన్నతల్లి ఏమంది
నాన్న ముద్దు కావాలంది
పాలుగారు చెక్కిలి పైన పాపాయికి ఒకటి 
తేనెలూరు పెదవులపైన దేవిగారికొకటి 
ఒకటేనా,ఒకటేనా 
ఎన్నైనా,ఎన్నెన్నో 
మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను 
అంతే అంతే అంతే                                            "కుశలమా"

పెరటిలోని పూల పానుపు 
త్వరత్వరగా రమ్మంది 
పొగడ నీడ పొదరిల్లో 
దిగులు దిగులుగా ఉంది
ఎన్ని కబురులంపేనో ఎన్ని కమ్మలంపెనో 
పూలగాలి రెక్కలపైనా నీలిమబ్బు చాయలపైన 
అందేనా ఒకటైనా 
అందెనులే తొందర తెలిసెనులే 
ఇన్నినాళ్ళు వదలలేక ఏదో ఏదో వ్రాసాను 
అంతే అంతే అంతే                                                   "కుశలమా"


చిత్రం                       బలిపీఠం
రచన                       దేవులపల్లి 
సంగీతం                   చక్రవర్తి

0 comments:

Post a Comment