Thursday, April 14, 2011

రాశాను ప్రేమలేఖలెన్నో, వీణ వేణువైన సరిగమ

రాశాను ప్రేమలేఖలెన్నో


ఒకనాటి సూపర్ హిట్ పాట ఇది.ఈ సినిమా వచ్చినప్పుడు పుట్టిన  చాలామంది అమ్మాయిలకి శ్రీదేవి అనే పేరు పెట్టారు హరనాథ్,కే ఆర్ విజయ జంట ఈ పాటలో చాలా బావుంటుంది 




 రాశాను ప్రేమలేఖలెన్నో 
దాచాను ఆశలన్ని నీలో  
భువిలోన మల్లియలాయే 
దివిలోన తారకలాయే నీ నవ్వులే                                 "రాశాను "

కొమ్మల్లో కోయిలమ్మ కో యన్నది
కొమ్మల్లో కోయిలమ్మ కో యన్నది  
నా మనసు నిన్నే తలచి ఓ యన్నది
మురిపించే ముద్దు గులాబీ మొగ్గేసింది 
చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది                                   "రాశాను"

నీ అడుగుల సవ్వడి ఉంది నా గుండెలో 
నీ చల్లని రూపం ఉంది నా కనులలో 
నాలోని సోయగమంతా విరబూసేలే 
మనకోసం స్వర్గాలన్నీ దిగివచ్చెనులే                         "రాశాను"

అందాల పయ్యెద నేనై  ఆటాడనా
కురులందు కుసుమము నేనై చెలరేగనా
నీ చేతుల వీణను నేనై పాట పాడనా
నీ పెదవుల గుసగుస నేనై పొంగిపోదునా                   "రాశాను"


చిత్రం                  శ్రీదేవి 
సంగీతం              జి.కే వెంకటేష్ 
రచన                  దాశరధి


 వీణ వేణువైన సరిగమ 

 బాలూ,జానకి స్వరాలలో మరో అందమైన పాట. ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.రాజన్ నాగేంద్ర స్వరకల్పనలో వేటూరి సాహిత్యం మనసుని ఆకట్టుకుంటుంది



వీణ వేణువైన సరిగమ విన్నావా  
తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహ లాడాల చెలరేగాల, 
చెలి ఊగాల ఉయ్యాలలీ వేళలో                                            "వీణ"

ఊపిరి తగిలిన వేళ నే వంపులు తిరిగిన వేళ
నా వీణలో నీ వేణువే పలికే రాగమాల 
చూపులు  రగిలిన  వేళ ఆ చుక్కలు వెలిగిన వేళ 
నా తనువున అణువణువునా జరిగే రాసలీల                       "వీణ "


ఎదలో అందం ఎదుట, ఎదుటే వలచిన వనిత 
నీ రాకతో నా తోటలో వెలసే వనదేవత 
కదిలే అందం కవిత, అది కౌగిలికొస్తే యువత 
నా పాటలో నీ పల్లవే నవతా నవ్య మమతా                            "వీణ"

 
చిత్రం                        ఇంటింటి రామాయణం 
రచన                        వేటూరి 
సంగీతం                       రాజన్ నాగేంద్ర 































Wednesday, March 9, 2011

ఒక దేవత వెలసింది ,ఏదో ఒక రాగం

ఒక  దేవత వెలసింది ,





ఒక  దేవత వెలసింది నా కోసమే 
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే 
సంధ్యాకాంతుల్లోన శ్రావణిలా  
సౌందర్యాలే  చిందే యామినిలా
ఎన్నో జన్మల్లోని పున్నమిలా 
శ్రీరస్తంటూ  నాతో అంది ఇలా 
నిన్నే ప్రేమిస్తానని    


 విరిసే వెన్నెల్లోనా,మెరిసే కన్నుల్లోనా
నీ నీడే చూశానమ్మా 
ఎనిమిది దిక్కులలోన  ముంగిలి చుక్కల్లోనా 
నీ జాడే వెతికానమ్మా  
నీ నవ్వే  నా మదిలో అమృతవర్షం 
ఒదిగింది  నీలోనే అందని స్వర్గం 
నునుసిగ్గుల మొగ్గలతో ముగ్గులు వేసి 
మునుముందుకు వచ్చేనే  చెలినే చూసి 
అంటుందమ్మా నా మనసే 
నిన్నే ప్రేమిస్తానని                                                    "ఒక దేవత "


రోజా మొక్కను నాటి ప్రాణం నీరుగా పోసి 
పూయించా నీ జడ కోసం  
రోజూ ఉపవాసంగా,హృదయం నైవేద్యంగా 
పూజించా నీ జత కోసం
నీరెండకు నీవెంటే  నీడై వచ్చి 
మమతలతో  నీగుడిలో ప్రమిదలు చేస్తా 
ఊపిరితో నీ రూపం  అభిషేకించి 
ఆశలతో నీ వలపుకు హారతులిస్తా 
ఇన్నాళ్ళూ అనుకోలేదే 
నిన్నే ప్రేమిస్తానని                                               "ఒక దేవత "



చిత్రం        నిన్నే ప్రేమిస్తా 
రచన         రాంబాబు
సంగీతం     ఎస్ ఎ రాజ్ కుమార్



ఏదో ఒక రాగం 





ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ 
ఎదలో నిదురించే కధలెన్నో కదిలేలా 
నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా 
నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా 
జ్ఞాపకాలే మైమరుపు, జ్ఞాపకాలే మేల్కొలుపు 
జ్ఞాపకాలే నిట్టూర్పు , జ్ఞాపకాలే ఓదార్పు                       "ఏదో ఒక"

వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే 
పూచే పువ్వులలో నీ నవ్వులు  జ్ఞాపకమే 
తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే
తులసి మొక్కలో  నీ సిరుల జ్ఞాపకం
చిలక ముక్కులా నీ అలక జ్ఞాపకం                                 "ఏదో ఒక "

మెరిసే తారలలో నీ చూపులు  జ్ఞాపకమే
ఎగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే
కోవెలలోని దీపంలా నీ రూపం జ్ఞాపకమే
పెదవి పైన నీ పేరే చిలిపి జ్ఞాపకం
మరపు రాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం                       "ఏదో ఒక"

 చిత్రం                 రాజా 
రచన                  సిరివెన్నెల 
సంగీతం              ఎస్.ఎ.రాజ్ కుమార్

Wednesday, February 16, 2011

ఈ మధుమాసంలో,వానొచ్చే వరదొచ్చే

ఈ మధుమాసంలో ,
కొండవీటి సింహం లోని ఈ రెండు పాటలూ చాలా బావుంటాయి.
తెలవారిన సంజెలలో తేనె నీటి వడగళ్ళు 
జ్ఞాపకాల నీడలలో కరుగుతున్న కన్నీళ్ళు 
ఈ రెండు  వాక్యాల దగ్గర బాలూ స్వరం ఎంత బావుంటుందో 




ఈ మధుమాసంలో,ఈ దరహాసంలో 
మదిలో కదిలీ పలికే కోయిలా 
బ్రతుకే హాయిగా                                                 "ఈ మధుమాసంలో"

ఆకాశం అంచులు దాటే ఆవేశం నాగీతం 
అందులోని ప్రతి అక్షరమూ అందమైన నక్షత్రం 
ఆ గీతం పలికిన నా జీవితమే సంగీతం 
సంగమించు ప్రణయంలో  ఉదయరాగ సింధూరం 
ప్రేమేపెన్నిధిగా, దైవం సన్నిధిగా
ప్రేమేపెన్నిదిగా, దైవం సన్నిధిగా 
సమశ్రుతిలో  జతకలిసి ,
ప్రియలయలో ఆదమరిచి 
అనురాగాలు పలికించు వేళ                                    "ఈమదుమాసంలో" 

 అందమైన మన ఇల్లు అవని మీద హరివిల్లు 
రుతువులెన్ని మారినా వసంతాలు వెదజల్లు 
తెలవారిన సంజెలలో తేనేనీటి వడగళ్ళూ
జ్ఞాపకాల నీడలలో కరుగుతున్న కన్నీళ్లు 
 ఒకటే ఊపిరిగా, కలలే చూపులుగా 
 ఒకటే ఊపిరిగా, కలలే చూపులుగా
మనసులలో మనసెరిగీ
మమతలనే మధువొలికే 
శుభయోగాలు  తిలకించు వేళా                            "ఈ మధుమాసంలో"                                                           


 వానొచ్చే వరదొచ్చే 




వానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చే 
నీలో గోదారి పొంగే 
నీ పొంగులలో మునిగి  నీ కౌగిలిలో కరిగి 
అలలెన్నో నాలోన ఉయ్యాలలూగే

వానొచ్చే వరదొచ్చే వలపించే మనసిచ్చే 
నీలో నా ఈడు పొంగే 
నీ మాటలకే అలిగి నీ పాటలలో వెలిగి 
కలలెన్నో పులకించి కౌగిళ్లు చేరే 

ఆకాశమంతా  పందిళ్ళు వేసి
భూలోకమంతా పీటల్లు వేసి
ఆకాశమంతా  పందిళ్ళు వేసి
భూలోకమంతా పీటల్లు వేసి
కౌగిళ్ళలోనే నా ఇళ్లు చూసి 
నీ కళ్ళతోనే ఆ ముళ్ళు వేసి 
త్వరపడి మది  త్వరపడి నీ జత చేరితే
ఉరవడి నా చెలి వడిలో చెలరేగితే 
నాలో నీలో 
తొలి కోరిక చలి తీరక నిను చేరగా 
తనువులు ముడిపడినవి ఈ చలిగాలిలో                        "వానొచ్చే"

కార్తీక వేళ కన్నుల్లు కలిసే 
ఏకాంత వేళ ఎన్నెల్లు కురిసే 
కార్తీక వేళ కన్నుల్లు కలిసే 
ఏకాంత వేళ ఎన్నెల్లు కురిసే
నీ చూపులోన సూరీడు మెరిసే 
నీ ఈడుతోనే నా ఈడు ఒరిసే
తడి అలజడి చలి ముడివడి నిను కోరితే
ఎడదల సడి పెదవులబడి సుడిరేగితే 
నీవే నేనై 
తొలి జంటగా చలిమంటలే ఎదనంటగా 
రగిలెను సెగలకు వగలీ చలిమంటలో                              "వానొచ్చే"



Saturday, February 5, 2011

వీణ నాది తీగె నీది, కుశలమా నీకు

వీణ నాది తీగె నీది


 




వీణ  నాది  తీగె  నీది  తీగ  చాటు  రాగముంది  
తీగ చాటు రాగముంది 
పువ్వు నాది,పూత నీది,ఆకు చాటు అందముంది                      "వీణ"

తొలిపొద్దు ముద్దాడగానే ఎరుపెక్కే తూరుపు దిక్కు  
తొలి చూపు మాటాడగానే  వలపొక్కటే వయసు దిక్కు 
వరదల్లె వాటేసి,మనసల్లే మాటేసి,వయసల్లే కాటేస్తే చిక్కు 
తీపి ముద్దిచ్చి తీర్చాలి మొక్కు                                                "వీణ"

మబ్బుల్లో మెరుపల్లే కాదు వలపు వాన కురిసి వెలిసిపోదు 
మనసంటే మాటలు కాదు అది మాట ఇస్తే మరచిపోదు 
బ్రతుకల్లే జతగూడి,వలపల్లే ఒనగూడి, ఒడిలోనే గుడికట్టే దిక్కు,
నా గుడి దీపమై నాకు దక్కు                                                     "వీణ" 

చిత్రం                              కటకటాలరుద్రయ్య
రచన                              వేటూరి 
సంగీతం                          జే.వి.రాఘవులు


కుశలమా నీకు 

 


కుశలమా నీకు కుశలమేనా 
మనసు నిలుపుకోలేకా మరీ మరీ అడిగాను అంతే అంతే అంతే 
కుశలమా మీకు కుశలమేనా 
ఇన్నినాళ్ళు వదలలేకా ఏదో ఏదో వ్రాసాను 
అంతే అంతే అంతే  
కుశలమా                                         

చిన్నతల్లి ఏమంది
నాన్న ముద్దు కావాలంది
పాలుగారు చెక్కిలి పైన పాపాయికి ఒకటి 
తేనెలూరు పెదవులపైన దేవిగారికొకటి 
ఒకటేనా,ఒకటేనా 
ఎన్నైనా,ఎన్నెన్నో 
మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను 
అంతే అంతే అంతే                                            "కుశలమా"

పెరటిలోని పూల పానుపు 
త్వరత్వరగా రమ్మంది 
పొగడ నీడ పొదరిల్లో 
దిగులు దిగులుగా ఉంది
ఎన్ని కబురులంపేనో ఎన్ని కమ్మలంపెనో 
పూలగాలి రెక్కలపైనా నీలిమబ్బు చాయలపైన 
అందేనా ఒకటైనా 
అందెనులే తొందర తెలిసెనులే 
ఇన్నినాళ్ళు వదలలేక ఏదో ఏదో వ్రాసాను 
అంతే అంతే అంతే                                                   "కుశలమా"


చిత్రం                       బలిపీఠం
రచన                       దేవులపల్లి 
సంగీతం                   చక్రవర్తి

Tuesday, February 1, 2011

నీ నవ్వు చెప్పింది నాతో ,నువ్వేనా

నీ నవ్వు చెప్పింది నాతో 

పంచేందుకే ఒకరు లేని బ్రతుకెంత బరువో అని 
ఏ తోడుకీ నోచుకోని నడకెంత అలుపో అని 
ఎంత చక్కటి భావమో కదా.అలవోకగా హాయిగా సాగిపోయే ఈ పాట 
ఎన్ని సార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుంది




నీ నవ్వు చెప్పింది నాతో,నేనెవ్వరో ఏమిటో 
నీ నీడ చూపింది నాలో, ఇన్నాళ్ళ లోటేమిటో
ఓ లాలలా                                                                   "నీ నవ్వు"

నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని 
నాకై చాచిన నీ చేతిలో చదివాను నీ నిన్నని 
నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపుని 
పంచేందుకే ఒకరు లేని బ్రతుకెంత బరువో అని 
ఏ తోడుకీ నోచుకోని నడకెంత అలుపో అని

నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
వెన్నెల పేరే వినిపించనీ,నడిరేయి కరిగించనీ 
నా పెదవిలో నవ్వులాగే  చిరునవ్వు పుడుతుందని 
నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందని


ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు  బరువెక్కునో
ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు  బరువెక్కునో  
తనువు మనసు చెరిసగమని పంచాలి  అనిపించునో 
సరిగా అదే శుభము కోసం సంపూర్ణమయ్యేందుకు 
మనమే మరో కొత్త జన్మం, పొందేటి బంధాలకు                  "నీ నవ్వు"

చిత్రం                      అంతం 
రచన                      సిరివెన్నెల 
సంగీతం                  ఆర్ .డి. బర్మన్



నువ్వేనా సంపంగి పూల నువ్వేనా











నువ్వేనా సంపంగి పూల నువ్వేనా 
నువ్వేనా సంపంగి పూల నువ్వేనా 
జాబిలి నవ్వున నువ్వేనా 
గోదారి పొంగున నువ్వేనా ,నువ్వేనా 

నిన్నేనా అది నేనేనా కలగన్నానా కనుగొన్నానా 
నిన్నేనా అది నేనేనా కలగన్నానా కనుగొన్నానా
అల్లిబిల్లి పదమల్లేనా  అది అందాల పందిరి వేసేనా
అల్లిబిల్లి పదమల్లేనా  అది అందాల పందిరి వేసేనా                  "నువ్వేనా"


కళ్ళేనా ,
కళ్ళేనా  హరివిల్లేనా అది  చూపేనా విరితూపేనా 
కళ్ళేనా  హరివిల్లేనా అది  చూపేనా విరితూపేనా
తుళ్ళితుళ్ళిపడు వయసేనా నను తొందరవందర చేసేనా
తుళ్ళితుళ్ళిపడు వయసేనా నను తొందరవందర చేసేనా         "నువ్వేనా"


నువ్వైనా నీ నీడైనా ఏనాడైనా నా తోడౌనా 
నువ్వైనా నీ నీడైనా ఏనాడైనా నా తోడౌనా
మళ్లీమళ్లీ  కల వచ్చేనా ఇలా మల్లెల మాపై విచ్చేనా 
మళ్లీమళ్లీ  కల వచ్చేనా ఇలా మల్లెల మాపై విచ్చేనా               "నువ్వేనా"


చిత్రం                    గుప్పెడుమనసు 
రచన                    ఆత్రేయ 
సంగీతం                ఎం .ఎస్.విశ్వనాధన్


Friday, January 21, 2011

మౌనం గానం మధురం, పొంగిపొరలే అందాలెన్నో


మౌనం  గానం  మధురం మధురాక్షరం 

బాలూ స్వరకల్పనలో మయూరి సినిమాలో అన్ని పాటలూ బావుంటాయి.కానీ బాలు జానకి తో కలిసి పాడిన ఈ పాట నాకు చాలా ఇష్టం. 
ఈ పాట స్వరంవిని, వెంటనే రాసుకో అని పల్లవి చెప్పేసారట వేటూరి గారు.
చైత్ర పవనాలూ,మైత్రి గంధాలూ, ఈశాన్య దీపాలూ  ఎన్ని పదాలు మనసుని హత్తుకుంటాయో



మౌనం  గానం  మధురం మధురాక్షరం 
దేహం ప్రాణం కలిపే  మంత్రాక్షరం 
నయన సంగీతం,హృదయ సందేశం 
ఈశాన్య దీపాలు వెలిగిన గుడిలో                          "మౌనం "

చైత్ర పవనాలు వీచి మైత్రి గంధాలు పూసేను 
వయసు ముంగిళ్ళు తీసి వలపులే ముగ్గులేసేను 
సుమవీధుల్లో భ్రమరాలెన్నో
చెలి కన్నుల్లో భ్రమలెన్నెన్నో 
సాగేనులే శ్రుతిలో కృతిగా                                    "మౌనం"


అరుణ చరణాలలోనే హృదయకిరణాలు వెలిగేను 
ముదిత పాదాల ముందే మువ్వగోపాల పాడేను
అవి మోహాలో మధుదాహాలో
చెలి హాస్యాలో తొలి మాసాల్లో 
హంసధ్వనీ  కళలే కలగా                                       "మౌనం"

చిత్రం                  మయూరి
రచన                  వేటూరి 
సంగీతం              బాలు



పొంగిపొరలే అందాలెన్నో

ఇళయరాజా సంగీతంలో అద్భుతమైన పాట ఇది.చరణాల్లో ఆలాపనలు 
మనసును ఎక్కడికో తీసుకువెళ్ళి పోతాయి 
 






పొంగిపొరలే అందాలెన్నో పొంగి పొరలే 
కన్నె మదిలో అందాలెన్నో పొంగిపొరలే 
కోనల్లోన,లోయల్లోన నేలపైన నీ కదలే,
వన్నెకాడు నన్ను కలిసే 

పూలే రమ్మనగా ,పరువాలే జుమ్మనగా 
పూలే రమ్మనగా,పరువాలే జుమ్మనగా 
ప్రాణాలే చింతనగా, హృదయాలే జల్లనగా                    "పొంగిపొరలే"


కోయిల పాటలలోనా,ఆ కోవెల గంటలలోనా 
కోయిల పాటల లోనా ఆ కోవెల గంటలలోనా 
మ్రోగిందీ ,మ్రోగిందీ రాగం,
ఆడిందీ తాళం,అది నీ కోసం                                    "కన్నెమదిలో"

పాటను నేర్చే భామా  తొలి పాటల్లే మన ప్రేమా 
పాటను నేర్చే భామా  తొలి  పాటల్లే  మన ప్రేమా 
కన్నుల్లో మౌనం,నవ్వుల్లో గానం 
అది నా కోసం                                                       "పొంగిపొరలే "

చిత్రం                      కొత్తజీవితాలు 
రచన                      సి.నారాయణరెడ్డి 
సంగీతం                 ఇళయరాజా  




Saturday, January 15, 2011

పూలు గుసగుసలాడేనని,నీలాలు కారేనా

పూలు గుసగుసలాడేనని,

హుషారుగా సాగే  ఈ పాటలో ధ్వనించే చిన్న వెస్ట్రన్ రాప్ చాలా బావుంటుంది. ఒరిజినల్ వీడియో దొరకలేదు కానీ ఈ మిక్సింగ్  కూడా బాగా చేసారు.



పూలు గుసగుసలాడేనని,జతగూడేనని
గాలి ఈలలు వేసేనని, సైగ చేసేనని
అది ఈ రోజే తెలిసిందీ  హా                               "గాలి"

మబ్బు కన్నెలు పిలిచేనని
మనసు రివ్వున  ఎగసేనని 
వయసు సవ్వడి  చేసేనని ఇపుడె తెలిసిందీ    " గాలి "

అలలు చేతులు సాచేనని 
నురుగు నవ్వులు పూచేనని 
నింగి నేలను తాకేనని  నేడే తెలిసిందీ             "గాలి " 

చిత్రం                      శ్రీవారు మావారు 
రచన                      సి.నారాయణరెడ్డి 
సంగీతం                  జి.కే.వెంకటేష్ 



నీలాలు  కారేనా 

ఒడిలో నువ్వుంటే,ఒదిగిపోతుంటే కడతేరిపోవాలిలే 
జాజి పూసేవేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా 
ఎంత గొప్ప అనుభూతి,
 

 

నీలాలు కారేనా ,కాలాలు మారేనా 
నీ జాలి నే పంచుకోనా
నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ ,జాబిల్లి వేళ పూల డోల నేను కానా   "నీలాలు "

సూరీడు నెలరేడు  సిరిగల దొరలే కారులే
పూరి  గుడిసెల్లో,పేద మనసుల్లో,వెలిగేటి దీపాలులే 
ఆ నింగి ఈ నేల కొనగల సిరులే లేవులే 
కలిమి లేముల్లో,కరిగే ప్రేమల్లో నిరుపేద లోగిళ్ళులే      " నీలాలు "

ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో
కలికి వెన్నెల్లో,కలల కన్నుల్లో కలతారిపోవాలిలే 
ఆ తారలే తేరి తళతళ మెరిసే రేయిలో
ఒడిలో నువ్వుంటే, ఒదిగి పోతుంటే
కడతేరి పోవాలిలే                                                       "నీలాలు " 


చిత్రం                ముద్దమందారం 
రచన                వేటూరి 
సంగీతం            రమేష్ నాయుడు



Wednesday, January 12, 2011

మ్రోగింది కళ్యాణ వీణ,చిరునవ్వుల తొలకరిలో

 మ్రోగింది కళ్యాణ వీణ 

సాలూరి వారి స్వరకల్పనలోఅద్భుతమైన పాట ఇది.పాడుకుంటున్నది

అర్జునుడు,సుభద్ర.ఇంక ఊహలకు లోటేముంటుంది.పిల్లగాలితో

కబురులూ,నీలిమబ్బుల లేఖలూ,వీటితో ఆమె పులకించిపోతుంది.

వారి పెళ్ళికి మత్త కోకిలలు ముత్తైదువలుగా ,నెమలికన్నెలు నాట్యాలు

చేస్తాయట.మదనుడే ముహూర్తం చూసి పురోహితుడు అవుతాడట.

స్వరాల తేనెలు ఊరే పాట ఇది. చిత్రీకరణ కూడా అంతగానూ బావుంటుంది.





మ్రోగింది కళ్యాణ వీణ,
మ్రోగింది  కళ్యాణ వీణ 
నవ మోహన జీవన మధువనిలోనా 
మ్రోగింది కళ్యాణ వీణ                               "మ్రోగింది"

పిల్ల గాలితో  నేనందించిన పిలుపులే విన్నావో 
నీలిమబ్బుపై నే లిఖియించిన లేఖలందు కున్నావో
ఆ లేఖలే వివరించగా 
రసరేఖలే ఉదయించగా
కల వరించి,కలవరించి 
కల వరించి,కలవరించి
పులకిత తనులత నిను చేరుకోగా              "మ్రోగింది "

 మత్తకోకిలలు ముత్తైదువలై మంగళ గీతాలు పాడగా
మయూరాంగనలు ఆటవెలదులై లయలహరులపై ఆడగా  
నా యోగమే ఫలియించగా 
ఆ దైవమె కరుణించగా 
నా యోగమే ఫలియించగా
ఆ దైవమే కరుణించగా 
సుమశరుడే  పురోహితుడై 
సుమశరుడే  పురోహితుడై
శుభముహూర్తమే నిర్ణయించగా             " మ్రోగింది "

చిత్రం     కురుక్షేత్రం 
రచన     సి .నారాయణ రెడ్డి 
సంగీతం  ఎస్ .రాజేశ్వరరావు

చిరునవ్వుల తొలకరిలో 


నిజంగానే చిరునవ్వుల తోనూ ,సిరిమల్లెల్ల తోనూ,హృదయాలు పలుకుతాయి.అతను ప్రేయసి కోసం వసంతాలు దోసిట పట్టగలడు,తారలను దీపాలు చెయ్యగలడు. ఆమె కూడా అంతే,ఉరికే సెలయేరులనూ,ఉరిమే మేఘాలనూ అతనిలోనే చూస్తుంది.






చిరునవ్వుల  తొలకరిలో 
సిరిమల్లెల చినుకులలో 
పలికేనులే హృదయాలే
పలికేనులే హృదయాలే
తొలి వలపుల కలయికలో         "చిరునవ్వుల " 

వసంతాలు దోసిట దూసి విసిరెను నీ ముంగిలిలో 
తారలనే దివ్వెలు చేసి  వెలిగింతు నీ కన్నులలో
నీవే నా జీవనాదిగా 
నీవే నా జీవనాదిగా
ఎగసేను  గగనాల అంచులలో
విరియునులే ఆ గగనాలే నీ వెన్నెల కౌగిలిలో           "చిరునవ్వుల" 


ఉరికే  సెలయేరులన్నీ ఒదిగిపోవు నీ నడకలలో 
ఉరిమే మేఘాలన్నీ ఉలికిపడును నీ పలుకులలో 
నీవే నా పుణ్య మూర్తిగా 
నీవే నా పుణ్య మూర్తిగా
ధ్యానింతు నా మధుర భావనలో
మెరియునులే ఆ భావనలే ఇరు మేనుల అల్లికలో       "చిరునవ్వుల" 

చిత్రం             చాణక్యచంద్రగుప్త 
రచన             సి.నారాయణ రెడ్డి 
సంగీతం         పెండ్యాల

Thursday, January 6, 2011

ప్రతిరాత్రి వసంత రాత్రి


 అందరికీ హాయ్ అండీ.పాటలంటే నాకు చాలా ఇష్టం.అందులోనూ బాలు పాటలంటే ప్రాణం.అమృతాన్ని తేనె లో రంగరించినట్టు  ఉండే అపురూపమైన ఆ స్వరాన్ని ఇందులో పదిలపరచు కోవాలని నా ఆశ.అందుకే ఈ బ్లాగ్.ఇందులో కేవలం బాలు పాడిన పాటలు మాత్రమే ఉంటాయి.నా లాంటి బాలు అభిమానులు ఎవరైనా ఉంటే వారికి నచ్చుతుందని ఆశిస్తూ,

ముందుగా ఎప్పటికీ నాకు ఇష్టమైన 

ప్రతిరాత్రి వసంత రాత్రి 

నీలో నా పాట కదిలి నాలో నీ అందె మెదలి, లోలోన మల్లె పొదల

పూలెన్నో విరిసి విరిసి,

ఎంత అద్భుతమైన భావమో కదా,  ప్రతి నిమిషం మధుమాసమై బ్రతుకంతా ఒక తీయని పాట లా సాగిపోతే అంతకంటే ఏమి కావాలి.

తార వంక చంద్రుడు ఒరిగితే, విరజాజి  మావి చెంతకు చేరితే, ప్రేమికులిద్దరిని చూచి వనమంతా వలచిందట.

మనసు పూల తేరులో తేలిపోవడానికి  ఈ పాట వింటే చాలు.



ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి
ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి

బ్రతుకంతా ప్రతి నిమిషం పాట లాగా సాగాలి
ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాటలాగా సాగాలి.

నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి
నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి

లోలోన మల్లె పొదలా పూలెన్నో విరిసి విరిసి
లోలోన మల్లె పొదలా పూలెన్నో విరిసి విరిసి

మనకోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి
మనకోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి.

ఒరిగింది చంద్రవంక ఒయ్యారి తార వంక
ఒరిగింది చంద్రవంక ఒయ్యారి తార వంక

విరజాజి తీగ సుంత జరిగింది మావి చెంత
విరజాజి తీగ సుంత జరిగింది మావి చెంత

నను జూచి నిను జూచి వనమంతా వలచింది
నను జూచి ప్రియా ప్రియా వనమంతా వలచింది    " ప్రతి రాత్రి వసంత రాత్రి "

 చిత్రం                 ఏకవీర 
రచన                  దేవులపల్లి 
సంగీతం              కే.వి .మహదేవన్