Friday, January 21, 2011

మౌనం గానం మధురం, పొంగిపొరలే అందాలెన్నో


మౌనం  గానం  మధురం మధురాక్షరం 

బాలూ స్వరకల్పనలో మయూరి సినిమాలో అన్ని పాటలూ బావుంటాయి.కానీ బాలు జానకి తో కలిసి పాడిన ఈ పాట నాకు చాలా ఇష్టం. 
ఈ పాట స్వరంవిని, వెంటనే రాసుకో అని పల్లవి చెప్పేసారట వేటూరి గారు.
చైత్ర పవనాలూ,మైత్రి గంధాలూ, ఈశాన్య దీపాలూ  ఎన్ని పదాలు మనసుని హత్తుకుంటాయో



మౌనం  గానం  మధురం మధురాక్షరం 
దేహం ప్రాణం కలిపే  మంత్రాక్షరం 
నయన సంగీతం,హృదయ సందేశం 
ఈశాన్య దీపాలు వెలిగిన గుడిలో                          "మౌనం "

చైత్ర పవనాలు వీచి మైత్రి గంధాలు పూసేను 
వయసు ముంగిళ్ళు తీసి వలపులే ముగ్గులేసేను 
సుమవీధుల్లో భ్రమరాలెన్నో
చెలి కన్నుల్లో భ్రమలెన్నెన్నో 
సాగేనులే శ్రుతిలో కృతిగా                                    "మౌనం"


అరుణ చరణాలలోనే హృదయకిరణాలు వెలిగేను 
ముదిత పాదాల ముందే మువ్వగోపాల పాడేను
అవి మోహాలో మధుదాహాలో
చెలి హాస్యాలో తొలి మాసాల్లో 
హంసధ్వనీ  కళలే కలగా                                       "మౌనం"

చిత్రం                  మయూరి
రచన                  వేటూరి 
సంగీతం              బాలు



పొంగిపొరలే అందాలెన్నో

ఇళయరాజా సంగీతంలో అద్భుతమైన పాట ఇది.చరణాల్లో ఆలాపనలు 
మనసును ఎక్కడికో తీసుకువెళ్ళి పోతాయి 
 






పొంగిపొరలే అందాలెన్నో పొంగి పొరలే 
కన్నె మదిలో అందాలెన్నో పొంగిపొరలే 
కోనల్లోన,లోయల్లోన నేలపైన నీ కదలే,
వన్నెకాడు నన్ను కలిసే 

పూలే రమ్మనగా ,పరువాలే జుమ్మనగా 
పూలే రమ్మనగా,పరువాలే జుమ్మనగా 
ప్రాణాలే చింతనగా, హృదయాలే జల్లనగా                    "పొంగిపొరలే"


కోయిల పాటలలోనా,ఆ కోవెల గంటలలోనా 
కోయిల పాటల లోనా ఆ కోవెల గంటలలోనా 
మ్రోగిందీ ,మ్రోగిందీ రాగం,
ఆడిందీ తాళం,అది నీ కోసం                                    "కన్నెమదిలో"

పాటను నేర్చే భామా  తొలి పాటల్లే మన ప్రేమా 
పాటను నేర్చే భామా  తొలి  పాటల్లే  మన ప్రేమా 
కన్నుల్లో మౌనం,నవ్వుల్లో గానం 
అది నా కోసం                                                       "పొంగిపొరలే "

చిత్రం                      కొత్తజీవితాలు 
రచన                      సి.నారాయణరెడ్డి 
సంగీతం                 ఇళయరాజా  




Saturday, January 15, 2011

పూలు గుసగుసలాడేనని,నీలాలు కారేనా

పూలు గుసగుసలాడేనని,

హుషారుగా సాగే  ఈ పాటలో ధ్వనించే చిన్న వెస్ట్రన్ రాప్ చాలా బావుంటుంది. ఒరిజినల్ వీడియో దొరకలేదు కానీ ఈ మిక్సింగ్  కూడా బాగా చేసారు.



పూలు గుసగుసలాడేనని,జతగూడేనని
గాలి ఈలలు వేసేనని, సైగ చేసేనని
అది ఈ రోజే తెలిసిందీ  హా                               "గాలి"

మబ్బు కన్నెలు పిలిచేనని
మనసు రివ్వున  ఎగసేనని 
వయసు సవ్వడి  చేసేనని ఇపుడె తెలిసిందీ    " గాలి "

అలలు చేతులు సాచేనని 
నురుగు నవ్వులు పూచేనని 
నింగి నేలను తాకేనని  నేడే తెలిసిందీ             "గాలి " 

చిత్రం                      శ్రీవారు మావారు 
రచన                      సి.నారాయణరెడ్డి 
సంగీతం                  జి.కే.వెంకటేష్ 



నీలాలు  కారేనా 

ఒడిలో నువ్వుంటే,ఒదిగిపోతుంటే కడతేరిపోవాలిలే 
జాజి పూసేవేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా 
ఎంత గొప్ప అనుభూతి,
 

 

నీలాలు కారేనా ,కాలాలు మారేనా 
నీ జాలి నే పంచుకోనా
నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ ,జాబిల్లి వేళ పూల డోల నేను కానా   "నీలాలు "

సూరీడు నెలరేడు  సిరిగల దొరలే కారులే
పూరి  గుడిసెల్లో,పేద మనసుల్లో,వెలిగేటి దీపాలులే 
ఆ నింగి ఈ నేల కొనగల సిరులే లేవులే 
కలిమి లేముల్లో,కరిగే ప్రేమల్లో నిరుపేద లోగిళ్ళులే      " నీలాలు "

ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో
కలికి వెన్నెల్లో,కలల కన్నుల్లో కలతారిపోవాలిలే 
ఆ తారలే తేరి తళతళ మెరిసే రేయిలో
ఒడిలో నువ్వుంటే, ఒదిగి పోతుంటే
కడతేరి పోవాలిలే                                                       "నీలాలు " 


చిత్రం                ముద్దమందారం 
రచన                వేటూరి 
సంగీతం            రమేష్ నాయుడు



Wednesday, January 12, 2011

మ్రోగింది కళ్యాణ వీణ,చిరునవ్వుల తొలకరిలో

 మ్రోగింది కళ్యాణ వీణ 

సాలూరి వారి స్వరకల్పనలోఅద్భుతమైన పాట ఇది.పాడుకుంటున్నది

అర్జునుడు,సుభద్ర.ఇంక ఊహలకు లోటేముంటుంది.పిల్లగాలితో

కబురులూ,నీలిమబ్బుల లేఖలూ,వీటితో ఆమె పులకించిపోతుంది.

వారి పెళ్ళికి మత్త కోకిలలు ముత్తైదువలుగా ,నెమలికన్నెలు నాట్యాలు

చేస్తాయట.మదనుడే ముహూర్తం చూసి పురోహితుడు అవుతాడట.

స్వరాల తేనెలు ఊరే పాట ఇది. చిత్రీకరణ కూడా అంతగానూ బావుంటుంది.





మ్రోగింది కళ్యాణ వీణ,
మ్రోగింది  కళ్యాణ వీణ 
నవ మోహన జీవన మధువనిలోనా 
మ్రోగింది కళ్యాణ వీణ                               "మ్రోగింది"

పిల్ల గాలితో  నేనందించిన పిలుపులే విన్నావో 
నీలిమబ్బుపై నే లిఖియించిన లేఖలందు కున్నావో
ఆ లేఖలే వివరించగా 
రసరేఖలే ఉదయించగా
కల వరించి,కలవరించి 
కల వరించి,కలవరించి
పులకిత తనులత నిను చేరుకోగా              "మ్రోగింది "

 మత్తకోకిలలు ముత్తైదువలై మంగళ గీతాలు పాడగా
మయూరాంగనలు ఆటవెలదులై లయలహరులపై ఆడగా  
నా యోగమే ఫలియించగా 
ఆ దైవమె కరుణించగా 
నా యోగమే ఫలియించగా
ఆ దైవమే కరుణించగా 
సుమశరుడే  పురోహితుడై 
సుమశరుడే  పురోహితుడై
శుభముహూర్తమే నిర్ణయించగా             " మ్రోగింది "

చిత్రం     కురుక్షేత్రం 
రచన     సి .నారాయణ రెడ్డి 
సంగీతం  ఎస్ .రాజేశ్వరరావు

చిరునవ్వుల తొలకరిలో 


నిజంగానే చిరునవ్వుల తోనూ ,సిరిమల్లెల్ల తోనూ,హృదయాలు పలుకుతాయి.అతను ప్రేయసి కోసం వసంతాలు దోసిట పట్టగలడు,తారలను దీపాలు చెయ్యగలడు. ఆమె కూడా అంతే,ఉరికే సెలయేరులనూ,ఉరిమే మేఘాలనూ అతనిలోనే చూస్తుంది.






చిరునవ్వుల  తొలకరిలో 
సిరిమల్లెల చినుకులలో 
పలికేనులే హృదయాలే
పలికేనులే హృదయాలే
తొలి వలపుల కలయికలో         "చిరునవ్వుల " 

వసంతాలు దోసిట దూసి విసిరెను నీ ముంగిలిలో 
తారలనే దివ్వెలు చేసి  వెలిగింతు నీ కన్నులలో
నీవే నా జీవనాదిగా 
నీవే నా జీవనాదిగా
ఎగసేను  గగనాల అంచులలో
విరియునులే ఆ గగనాలే నీ వెన్నెల కౌగిలిలో           "చిరునవ్వుల" 


ఉరికే  సెలయేరులన్నీ ఒదిగిపోవు నీ నడకలలో 
ఉరిమే మేఘాలన్నీ ఉలికిపడును నీ పలుకులలో 
నీవే నా పుణ్య మూర్తిగా 
నీవే నా పుణ్య మూర్తిగా
ధ్యానింతు నా మధుర భావనలో
మెరియునులే ఆ భావనలే ఇరు మేనుల అల్లికలో       "చిరునవ్వుల" 

చిత్రం             చాణక్యచంద్రగుప్త 
రచన             సి.నారాయణ రెడ్డి 
సంగీతం         పెండ్యాల

Thursday, January 6, 2011

ప్రతిరాత్రి వసంత రాత్రి


 అందరికీ హాయ్ అండీ.పాటలంటే నాకు చాలా ఇష్టం.అందులోనూ బాలు పాటలంటే ప్రాణం.అమృతాన్ని తేనె లో రంగరించినట్టు  ఉండే అపురూపమైన ఆ స్వరాన్ని ఇందులో పదిలపరచు కోవాలని నా ఆశ.అందుకే ఈ బ్లాగ్.ఇందులో కేవలం బాలు పాడిన పాటలు మాత్రమే ఉంటాయి.నా లాంటి బాలు అభిమానులు ఎవరైనా ఉంటే వారికి నచ్చుతుందని ఆశిస్తూ,

ముందుగా ఎప్పటికీ నాకు ఇష్టమైన 

ప్రతిరాత్రి వసంత రాత్రి 

నీలో నా పాట కదిలి నాలో నీ అందె మెదలి, లోలోన మల్లె పొదల

పూలెన్నో విరిసి విరిసి,

ఎంత అద్భుతమైన భావమో కదా,  ప్రతి నిమిషం మధుమాసమై బ్రతుకంతా ఒక తీయని పాట లా సాగిపోతే అంతకంటే ఏమి కావాలి.

తార వంక చంద్రుడు ఒరిగితే, విరజాజి  మావి చెంతకు చేరితే, ప్రేమికులిద్దరిని చూచి వనమంతా వలచిందట.

మనసు పూల తేరులో తేలిపోవడానికి  ఈ పాట వింటే చాలు.



ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి
ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి

బ్రతుకంతా ప్రతి నిమిషం పాట లాగా సాగాలి
ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాటలాగా సాగాలి.

నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి
నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి

లోలోన మల్లె పొదలా పూలెన్నో విరిసి విరిసి
లోలోన మల్లె పొదలా పూలెన్నో విరిసి విరిసి

మనకోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి
మనకోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి.

ఒరిగింది చంద్రవంక ఒయ్యారి తార వంక
ఒరిగింది చంద్రవంక ఒయ్యారి తార వంక

విరజాజి తీగ సుంత జరిగింది మావి చెంత
విరజాజి తీగ సుంత జరిగింది మావి చెంత

నను జూచి నిను జూచి వనమంతా వలచింది
నను జూచి ప్రియా ప్రియా వనమంతా వలచింది    " ప్రతి రాత్రి వసంత రాత్రి "

 చిత్రం                 ఏకవీర 
రచన                  దేవులపల్లి 
సంగీతం              కే.వి .మహదేవన్