Wednesday, January 12, 2011

మ్రోగింది కళ్యాణ వీణ,చిరునవ్వుల తొలకరిలో

 మ్రోగింది కళ్యాణ వీణ 

సాలూరి వారి స్వరకల్పనలోఅద్భుతమైన పాట ఇది.పాడుకుంటున్నది

అర్జునుడు,సుభద్ర.ఇంక ఊహలకు లోటేముంటుంది.పిల్లగాలితో

కబురులూ,నీలిమబ్బుల లేఖలూ,వీటితో ఆమె పులకించిపోతుంది.

వారి పెళ్ళికి మత్త కోకిలలు ముత్తైదువలుగా ,నెమలికన్నెలు నాట్యాలు

చేస్తాయట.మదనుడే ముహూర్తం చూసి పురోహితుడు అవుతాడట.

స్వరాల తేనెలు ఊరే పాట ఇది. చిత్రీకరణ కూడా అంతగానూ బావుంటుంది.





మ్రోగింది కళ్యాణ వీణ,
మ్రోగింది  కళ్యాణ వీణ 
నవ మోహన జీవన మధువనిలోనా 
మ్రోగింది కళ్యాణ వీణ                               "మ్రోగింది"

పిల్ల గాలితో  నేనందించిన పిలుపులే విన్నావో 
నీలిమబ్బుపై నే లిఖియించిన లేఖలందు కున్నావో
ఆ లేఖలే వివరించగా 
రసరేఖలే ఉదయించగా
కల వరించి,కలవరించి 
కల వరించి,కలవరించి
పులకిత తనులత నిను చేరుకోగా              "మ్రోగింది "

 మత్తకోకిలలు ముత్తైదువలై మంగళ గీతాలు పాడగా
మయూరాంగనలు ఆటవెలదులై లయలహరులపై ఆడగా  
నా యోగమే ఫలియించగా 
ఆ దైవమె కరుణించగా 
నా యోగమే ఫలియించగా
ఆ దైవమే కరుణించగా 
సుమశరుడే  పురోహితుడై 
సుమశరుడే  పురోహితుడై
శుభముహూర్తమే నిర్ణయించగా             " మ్రోగింది "

చిత్రం     కురుక్షేత్రం 
రచన     సి .నారాయణ రెడ్డి 
సంగీతం  ఎస్ .రాజేశ్వరరావు

చిరునవ్వుల తొలకరిలో 


నిజంగానే చిరునవ్వుల తోనూ ,సిరిమల్లెల్ల తోనూ,హృదయాలు పలుకుతాయి.అతను ప్రేయసి కోసం వసంతాలు దోసిట పట్టగలడు,తారలను దీపాలు చెయ్యగలడు. ఆమె కూడా అంతే,ఉరికే సెలయేరులనూ,ఉరిమే మేఘాలనూ అతనిలోనే చూస్తుంది.






చిరునవ్వుల  తొలకరిలో 
సిరిమల్లెల చినుకులలో 
పలికేనులే హృదయాలే
పలికేనులే హృదయాలే
తొలి వలపుల కలయికలో         "చిరునవ్వుల " 

వసంతాలు దోసిట దూసి విసిరెను నీ ముంగిలిలో 
తారలనే దివ్వెలు చేసి  వెలిగింతు నీ కన్నులలో
నీవే నా జీవనాదిగా 
నీవే నా జీవనాదిగా
ఎగసేను  గగనాల అంచులలో
విరియునులే ఆ గగనాలే నీ వెన్నెల కౌగిలిలో           "చిరునవ్వుల" 


ఉరికే  సెలయేరులన్నీ ఒదిగిపోవు నీ నడకలలో 
ఉరిమే మేఘాలన్నీ ఉలికిపడును నీ పలుకులలో 
నీవే నా పుణ్య మూర్తిగా 
నీవే నా పుణ్య మూర్తిగా
ధ్యానింతు నా మధుర భావనలో
మెరియునులే ఆ భావనలే ఇరు మేనుల అల్లికలో       "చిరునవ్వుల" 

చిత్రం             చాణక్యచంద్రగుప్త 
రచన             సి.నారాయణ రెడ్డి 
సంగీతం         పెండ్యాల

2 comments:

Rajendra Devarapalli said...

రెండూ చాలా మంచి పాటలండి.కురుక్షేత్రం సినిమాలోనే హరివిల్లు దివినుండి దిగివచ్చెనేమో అన్నపాట కూడా చాలా బాగుంటుంది.మ్రోగింది కళ్యాణవీణ హిందీ కురుక్షేత్ర లో మహేంద్ర కపూర్,వాణీ జయరామ్ పాడారు.ఇక్కడ
http://www.raaga.com/channels/hindi/moviedetail.asp?mid=H003708


అలాగే చిరునవ్వుల తొలకరిలో అన్నపాట ఆల్ టైం హిందీ హిట్ సాంగ్స్ లో ఒకటి.ఆ లంకె ఇక్కడ:
http://www.raaga.com/channels/hindi/moviedetail.asp?mid=H000222

లత said...

లింక్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.
తప్పకుండా వింటానండీ

Post a Comment