Thursday, April 14, 2011

రాశాను ప్రేమలేఖలెన్నో, వీణ వేణువైన సరిగమ

రాశాను ప్రేమలేఖలెన్నో


ఒకనాటి సూపర్ హిట్ పాట ఇది.ఈ సినిమా వచ్చినప్పుడు పుట్టిన  చాలామంది అమ్మాయిలకి శ్రీదేవి అనే పేరు పెట్టారు హరనాథ్,కే ఆర్ విజయ జంట ఈ పాటలో చాలా బావుంటుంది 




 రాశాను ప్రేమలేఖలెన్నో 
దాచాను ఆశలన్ని నీలో  
భువిలోన మల్లియలాయే 
దివిలోన తారకలాయే నీ నవ్వులే                                 "రాశాను "

కొమ్మల్లో కోయిలమ్మ కో యన్నది
కొమ్మల్లో కోయిలమ్మ కో యన్నది  
నా మనసు నిన్నే తలచి ఓ యన్నది
మురిపించే ముద్దు గులాబీ మొగ్గేసింది 
చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది                                   "రాశాను"

నీ అడుగుల సవ్వడి ఉంది నా గుండెలో 
నీ చల్లని రూపం ఉంది నా కనులలో 
నాలోని సోయగమంతా విరబూసేలే 
మనకోసం స్వర్గాలన్నీ దిగివచ్చెనులే                         "రాశాను"

అందాల పయ్యెద నేనై  ఆటాడనా
కురులందు కుసుమము నేనై చెలరేగనా
నీ చేతుల వీణను నేనై పాట పాడనా
నీ పెదవుల గుసగుస నేనై పొంగిపోదునా                   "రాశాను"


చిత్రం                  శ్రీదేవి 
సంగీతం              జి.కే వెంకటేష్ 
రచన                  దాశరధి


 వీణ వేణువైన సరిగమ 

 బాలూ,జానకి స్వరాలలో మరో అందమైన పాట. ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.రాజన్ నాగేంద్ర స్వరకల్పనలో వేటూరి సాహిత్యం మనసుని ఆకట్టుకుంటుంది



వీణ వేణువైన సరిగమ విన్నావా  
తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహ లాడాల చెలరేగాల, 
చెలి ఊగాల ఉయ్యాలలీ వేళలో                                            "వీణ"

ఊపిరి తగిలిన వేళ నే వంపులు తిరిగిన వేళ
నా వీణలో నీ వేణువే పలికే రాగమాల 
చూపులు  రగిలిన  వేళ ఆ చుక్కలు వెలిగిన వేళ 
నా తనువున అణువణువునా జరిగే రాసలీల                       "వీణ "


ఎదలో అందం ఎదుట, ఎదుటే వలచిన వనిత 
నీ రాకతో నా తోటలో వెలసే వనదేవత 
కదిలే అందం కవిత, అది కౌగిలికొస్తే యువత 
నా పాటలో నీ పల్లవే నవతా నవ్య మమతా                            "వీణ"

 
చిత్రం                        ఇంటింటి రామాయణం 
రచన                        వేటూరి 
సంగీతం                       రాజన్ నాగేంద్ర